గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష తేదీ ఖరారు! 1 m ago
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 (నోటిఫికేషన్ నం. 11/2023) మెయిన్స్ పరీక్షను 2025 జనవరి 5న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రిలిమ్స్‌లో ఎంపికైన సుమారు లక్ష మంది అభ్యర్ధులు ఈ పరీక్షను రాయనున్నారు. డీఎస్సీ, పది, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు పరిగణనలోనికి తీసుకొని ఈ తేదీని ఖరారు చేసినట్లు ఏపీపీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. పరీక్ష కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.